calender_icon.png 14 October, 2024 | 2:43 AM

ఇంధన పొదుపుతో పర్యావరణ పరిరక్షణ

14-10-2024 12:43:07 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఎల్బీనగర్, అక్టోబర్ 13: ప్రతి ఒక్కరూ ఇంధనం పొదుపు చేసి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాగోల్‌లోని భారతీయ భూవైజ్ఞానిక సర్వేశిక్షణా సంస్థ(జీఎస్‌ఐటీసీ)లో ఏర్పాటు చేసిన రూప్‌టాప్ సోలార్ ప్లాంట్‌ను శనివారం కిషన్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఇందనపు పొదుపు చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా సోలార్, విండ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోందని అన్నారు. ఖర్చు లేకుండా, పర్యావరణం దెబ్బతినకుం డా ఇంటి పైకప్పు, ఖాళీ స్థలాల్లో సోలార్ (సౌరశక్తి) విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని.. ఇంటి కరెంట్ అవసరాలను తీర్చుకోవచ్చన్నారు.

సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సబ్బిడీ కూడా ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు నవజీవన్‌రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, అరుణాసురేందర్‌యాదవ్, పవన్‌కు మార్, అధికారులు పాల్గొన్నారు.