calender_icon.png 19 April, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత

19-04-2025 08:41:54 PM

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

హుజురాబాద్ (విజయక్రాంతి): స్వచ్ఛత మన జీవన విధానంలో ఒక భాగం కావాలని, పర్యావరణ పరిరక్షణ మనఅందరి బాధ్యత అని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప గార్డెన్స్ లో శనివారం హుజురాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో  స్వచ్ఛ హుజురాబాద్ ఎగ్జిబిషన్ హుజురాబాద్ ప్రభాకర్ సంగం కమిషనర్ కేంసారీ సమ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు, కె.వి.కె శాస్త్రవేత్తలు, మెప్మా మహిళా సంఘాల సమాఖ్యలు పర్యావరణ పరిరక్షణపై తడి చెత్త,పొడి చెత్త సేకరణ ఇతర అంశాలపై  ఎగ్జిబిషన్లు స్టాల్స్ ను ఏర్పాటు చేసి  ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. పరిశుభ్రత పట్ల పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వంతు కర్తవ్యం గా ప్రవర్తించాలని అన్నారు. హుజురాబాద్ కమిషనర్ సమ్మయ్య పర్యావరణంపై చెత్త సేకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించి హుజురాబాద్ ను స్వచ్ఛ హుజురాబాద్ గా మార్చడానికి ప్రయత్నం చేయడం అభినందనీయమని అన్నారు. పర్యావరణం పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు.

కమిషనర్ కెంసారపు సమ్మయ్య మాట్లాడుతూ... అందరి సహకారంతో పర్యావరణంపై ముందడుగు వేశానన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాధికారి జనార్దన్ రావు, ఆర్ డి ఎం ఏ సాహిద్ హుస్సేన్ మెప్మా పిడి వేణు మాధవరెడ్డి, ఐ ఈ సి ఎక్స్పర్ట్ ఫణి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హాకీ క్లబ్ మాజీ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్  మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గందె రాధిక ఎంఈఓ భూపతి శ్రీనివాస్ ఎంబీఐ కంచె వేణు, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సిడిపిఓ సుగుణ  ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోరం సంజీవరెడ్డి మండల అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు బి రాజ్ కుమార్ ఏఈ సాంబరాజు మేనేజర్ భూపాల్ రెడ్డి టి పి ఓ అశ్విని గాంధీ కిషన్ రావు వార్డు అధికారులు శానిటరీ జవానులు మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.