calender_icon.png 19 April, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

11-04-2025 12:00:00 AM

మందమర్రి, ఏప్రిల్ 10 : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని భారత ప్రభుత్వ పర్యావరణ శాస్త్రవేత్త పి శరత్ కుమార్ కోరారు. ఏరియాలోని జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పర్యావరణం ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ కు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులకు వివరించారు.

ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు పర్యావరణ అవగాహనకు తొలిసారిగా వచ్చిన భారత శాస్త్రవేత్తను ఏరియా జనరల్ మేనేజర్ జీ.దేవేందర్ మొక్కను అందజేసి శాలు వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జిఎం విజయ ప్రసాద్, జిఎం కార్యాలయ అన్ని డిపార్ట్మెంట్ల హెచ్‌ఓడిలు తదితరులు పాల్గొన్నారు.