calender_icon.png 18 April, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

03-04-2025 12:00:00 AM

దిల్‌సుఖ్‌నగర్ లోటస్ ల్యాప్ స్కూల్లో ఘనంగా ప్రపంచ పరిశుభ్రతా దినోత్సవం

ముషీరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, మనతోపాటు మన చుట్టూ పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా విద్యార్థులు నడుం బిగించాలని ప్రముఖ విద్యావేత్త, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ సలహాదారులు, తెలంగాణ గ్రీన్ అంబాసిడర్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. 

బుధ వారం దిల్ సుఖ్ నగర్ లోని లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్లో ‘ప్రపంచ పరిశుభ్రత దినోత్సవం’ ముందస్తు వేడుక ఘనంగా జరిగిం ది. ఈ కార్యక్రమానికి డాక్టర్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరుకాగా ఈపీడీసీ అధ్యక్షులు రంగయ్య ప్రత్యేక అతిధిగా హాజర య్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దశాబ్దకాలంగా లోటస్ ల్యాప్ విద్యాసంస్థ ఇటు విద్యార్థులకు అటు బయట సమాజానికి పరిశుభ్రత తోపాటు పర్యావరణ పరిర క్షణ కోసం ఉద్యమ పంథా కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  ఈ క్షణం నుం చి ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, అది బాహ్య పరిశుభ్రత అంతర్ పరిశుభ్రత కూడా కావాలని సూచించారు.

దేహం, మనసు, పరిశుభ్రత ఉన్నపుడే సమాజం నిశ్చలంగా ఉంటుందన్నారు.  స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ మాధవి సంగీ పిల్లలతో పరిశుభ్రత పై ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు డాక్టర్ గోపాల్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.