హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రకృతి వనరులు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి పేర్కొన్నారు. జాతీయ వాయు కాలుష్య దినోత్సవ్నా పురస్కరించుకొని సోమవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిబ్బందితో పర్యావరణ పరిరక్షణపై ప్రమాణం చేయించారు. వెంకటి మాట్లాడుతూ వాతావరణ కలుషితానికి మానవులు కారణమవుతున్నారన్నారు. భవిష్యత్ తరాలకు అనర్థాలు కలుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
డీజిల్, పెట్రోల్ వాహనాల వినియోగంతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందని, ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఆశ్రితరెడ్డి, ఏఓ సునీల్‌కుమార్, మహ్మద్ ఒమర్ బీన్‌సలేహ్ పాల్గొన్నారు.