calender_icon.png 2 March, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభయారణ్యంలోని ప్రాంతం గుండా వెళ్ళే వాహనాలకు పర్యావరణ రుసుము

31-01-2025 11:01:25 PM

జిల్లా అటవీ అధికారి శివ్ఆశిష్ సింగ్..

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలోని చెన్నూరు డివిజన్ ప్రాణహిత కృష్ణ జింకల వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన ప్రాంతం గుండా వెళ్లే వాహనాల నుంచి పర్యావరణ రుసుము వసూలు చేయడం కోసం ప్రతిపాదించడం జరిగిందని జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ శుక్ర వారం తెలిపారు. చెన్నూరు డివిజన్ పరిధిలోని ప్రాణహిత కృష్ణ జింకల అభయారణ్యంలోకి ప్రవేశించే వాహనాలకు పర్యావరణ రుసుము వసూలు చేసేందుకు యెంచపల్లి రక్షిత అటవీ ప్రాంతంలోని కంపార్ట్మెంట్ నెంబర్ 329లో, కోటపల్లి క్షేత్రంలోని పార్ పల్లి, చెన్నూర్ క్షేత్రంలోని కిష్టంపేట బీట్ వై-జంక్షన్ వద్ద 2 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. అభయారణ్యంలోని ప్రధాన ప్రాంతం గుండా వెళ్లే రహదారిలో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలు, వాటర్ బాటిల్లు, విస్మరించిన ఆహార పదార్థాలు లేకుండా ఉంచడం ప్రధాన ఉద్దేశంగా పర్యావరణ రుసుము వసూలు చేసేందుకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు.