calender_icon.png 2 April, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి

01-04-2025 02:14:10 AM

  1. హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో ప్రభుత్వం తీరు దుర్మార్గం
  2. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న చర్యలను కేంద్రబొ గ్గు, గనుల శాఖమంత్రి జీ కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం అంత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షాల గొంతునొక్కడం, విద్యార్థులను అణిచివేయడం, జీవవైవిధ్యాన్ని విధ్వంసం చేయడం, నిధుల కోసం హైదరాబాద్ పర్యావరణాన్ని పణంగా పెట్టడంపైనే దృష్టిపెట్టిం దని ఆరోపించారు.

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వేలం వేయడం.. ఈ ప్రాంతంలోని వృక్ష సంపదకు, ఇక్కడి జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని విమర్శించారు. అర్ధరాత్రి సమయంలో బుల్డోజర్లు పెట్టి చెట్లు నేలకూల్చడంతో.. అక్కడుంటున్న పక్షుల ఆర్తనా దాలు హృదయవిదారకంగా ఉన్నాయన్నా రు.

హెచ్‌సీయూ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల విద్యార్థుల గొంతులను అక్రమంగా నొక్కేస్తూ.. ఆక్రమణ చర్యలను మొండిగా చేపడుతుండటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలేని చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.