calender_icon.png 16 March, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీమ లిఫ్టుకు పర్యావరణ అనుమతి నిరాకరణ

16-03-2025 01:33:26 AM

  1. ఇది రాష్ట్ర ప్రభుత్వ విజయం
  2. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించిన ఏపీ
  3. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 15(విజయక్రాంతి): శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులను కేంద్రం నిరాకరించడాన్ని కాంగ్రెస్ సర్కారు సాధించిన విజయంగా  రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతులు నిరాకరిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

అంతర్రాష్ట్ర నిబంధ నలు ఉల్లంఘించి, రాయలసీమ లిఫ్టు నిర్మా ణ పనులను ఏపీ చేపట్టిందంటూ రాష్ట్రం తరఫున తాను పలుమార్లు కేంద్రం వద్ద వాదనలు వినిపించినట్టు తెలిపారు. ఈ విషయంపై రాష్ర్ట నీటిపారుదల ముఖ్య కార్య దర్శి రాహుల్ బొజ్జా కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని కూడా మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కేఆర్‌ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఏపీ ఈ ప్రాజెక్టును నిర్మించాలనుకున్నట్టు చెప్పారు. పర్యావరణ చట్టాలను కూడా ఉల్లంఘించి ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించిందని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ అక్రమంగా నిర్మిణిస్తున్న ఈ ప్రాజెక్టుపై దృష్టిపెట్టి నట్టు వివరించారు.

ఈ క్రమంలోనే తెలంగాణకు కేటాయించిన జలాలను కాపాడుకునే విషయంలో విజయం సాధించినట్టు తెలిపారు. ఏపీ అడుగడుగునా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడంతో కేంద్రం ఈ ప్రాజెక్టును అడ్డుకుందన్నారు.

పర్యావరణ అనుమతులు పొందేందుకు నిర్మాణ పనులు ప్రారంభించడానికి ముందే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి నీటి ని దోపిడీ చేయాలనుకున్న ఏపీ ప్రయత్నా న్ని అడ్డుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు.