03-03-2025 01:06:39 AM
కడ్తాల్, మార్చి 2 ( విజయక్రాంతి): కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మరియు హాయ్ ఆయిస్టర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన ‘సస్టైనబుల్ ఈకో అడ్వెంచర్ క్యాంప్‘ ఎర్త్ సెంటర్ కడ్తాల్ లో ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రధాన పాత్ర పోషించిన లీలా లక్ష్మారెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ ఆయిస్టర్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సింగాడే సునీల్ ముగింపు సమావేశంలో ప్రసంగించారు. ఈ ఈ రెండు రోజుల క్యాంపు కి ముఖ్యఅతిథిగా సాయి భాస్కర్ రెడ్డి ప్రముఖ పర్యావరణవేత్త పాల్గొని పర్యావరణం మరియు దాని పరిరక్షణలో యువత పాత్ర అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కలిగించారు.
ఎర్త్ సెంటర్ దగ్గర ఉన్న కడ్తాల్ అడవిలో ఉన్న ప్రకృతి ప్రకృతి అందాలను మరియు ప్రకృతి యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులు తెలుసుకున్నారు. అడవుల సంరక్షణ జంతువుల సంరక్షణ జీవవైవిద్యం, దాని ప్రాముఖ్యత మొదలగు అంశాలపై విద్యార్థులు చర్చల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిజిఆర్ సంస్థ ప్రతినిధులు జ్ఞానేశ్వర్, రజనికాంత్, మరియు ఆయిస్టర్ కోశాధికారి అనంతశర్మ, అరవింద్, వెంకటేష్, శివ, కృష్ణవేణి, రామకృష్ణ మరియు వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.