calender_icon.png 17 January, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణంపై అవగాహన

16-01-2025 10:46:48 PM

కడ్తాల్ (విజయక్రాంతి): కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, సిసిఆర్టి డిఆర్పి లు సంయుక్తంగా మూడు రోజుల జాతీయ విద్యా సదస్సు ఎర్త్ అండ్ కల్చర్ భూమి, సంస్కృతి అనే అంశం మీద గురువారం అన్మాస్ పల్లి ఎర్త్ సెంటర్ కడ్తాల్లో ప్రారంభమైంది. దేశంలోని 16 రాష్ట్రాల నుండి 60 మంది డీఆర్పీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షులు లీలా లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈనెల 18 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డైరెక్టర్ సిసిఆర్టి న్యూఢిల్లీ గిరీష్ జోషి, రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్సిఆర్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్.ఉపేందర్ రెడ్డి మొదటి రోజు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో గిరీష్ జోషి మాట్లాడుతూ.. 16 రాష్ట్రాల నుంచి హాజరైన సుమారు 60 మంది డిఆర్పీలు భూమి, సంస్కృతి అనే విషయం పట్ల విషయాల వారీగా కృత్యాలను విద్యార్థులకు వారి పాఠ్య ప్రణాళికలో నిత్యజీవితంలో పృథ్వి, సంస్కృతి యొక్క పాత్ర, దాని ఆవశ్యకత పాఠ్యప్రణాళికలో భాగంలోనే కాకుండా పర్యావరణ పరిరక్షణ, అనాదిగా ప్రకృతితో ముడిపడి ఉన్న సంస్కృతిని బోధించాలని వ్యక్తిగత అనుభవంలోకి వచ్చే విధంగా తయారు చేయాలని సూచించారు. ప్రొఫెసర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న కాలంలో భూమిపై జరుగుచున్న గ్లోబల్ వార్మింగ్ భూకంపాలు సునామీలు వాతావరణ కాలుష్యము మొదలగు ఉత్పాతాలు మానవాళిని భయకంపితులని చేస్తున్నాయని దానికి గల కారణం మానవులేనని కాబట్టి ఆ విషయం తెలుసుకొని ప్రతి ఒక్కరు పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉండి ప్రకృతిని కాపాడాలని అలాగే పచ్చదనంతో మళ్లీ ప్రకృతి ఒడిలో మనమంతా హాయిగా రానున్న కాలంలో గడపాలని దానికి గాను ఉపాధ్యాయులుగా మనం పిల్లలను విద్యావంతులను చేసి రానున్న కాలంలో ఒక మంచి ఆహ్లాదకరమైన పర్యావరణ పచ్చదనం నెలకొల్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ డాక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.