ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం: గీతా జయంతి సందర్భంగా ప్రభుత్వ డిగ్రి కళాశాలలో సుందరీకరణలో భాగంగా ప్రిన్సిపల్ డా.జాన్ మిల్టన్ గారి ఆధ్వర్యంలో భద్రాద్రి పట్టణ ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు గోళ్ళ భూపతి రావు సూచనతో కళాశాల ప్రణాళిక, అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి సౌందర్యానికి పర్యావరణమే మూలాధారం అని అవకాశం ఉన్న ప్రతి చోట మొక్కలు నాటి సుందర నందన వనాలుగా తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉందని పేర్కొన్నారు.
భద్రాచలం ప్రభుత్వ డిగ్రి కళాశాల విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపక బృందం తీసుకోవాలని, ఐటీసీ, భద్రాచలం పట్టణ, చుట్టుప్రక్కల ప్రాంతంలోని ప్రముఖుల దాతలందరి సహాయ సహకారాలు తీసుకొని తాము కళాశాల అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తామని డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.