calender_icon.png 16 November, 2024 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్యుమరేటర్ లు కులగననలో ఇబ్బంది పడుతున్నారు

16-11-2024 03:26:40 PM

ఎన్యూమరైటర్ల సంఖ్యను పెంచాలి

అడిషనల్ కలెక్టర్ తో మాట్లాడిన టిపిటిఎఫ్ ప్రతినిధులు 

కామారెడ్డి (విజయక్రాంతి): కులగననకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్ లకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి టిపిటిఎఫ్ జిల్లా కమిటీ ప్రతినిధులు అనిల్ కుమార్ లింగం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి రెవిన్యూ అదనపు కలెక్టర్ విక్టర్లను కలిసి శనివారం విన్నవించారు. కులగణనలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఎన్యుమరేటర్ల సంఖ్యను పెంచాలని కోరారు. సర్వే గడువును కూడా పొడిగించాలని వారు కోరారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ ప్రతినిధులు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ లింగం, జిల్లా ఉపాధ్యక్షురాలు నళినీ దేవి, జిల్లా కార్యదర్శి నరేందర్, సిహెచ్ లక్ష్మి, విజయ శ్రీ తదితరులు పాల్గొన్నారు.