మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
ఘట్‌కేసర్, అక్టోబర్ 27(విజయక్రాంతి): నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి (వైయస్సార్) చేస్తున్న ప్రజాసేవ ఆదర్శప్రాయమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేం దర్ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో గ్రూప్ మెయిన్స్ పరీక్షలు రాస్తున్న 160 మంది అభ్యర్థులకు సుదర్శన్‌రెడ్డి 7 రోజుల పాటు భోజనం, వసతి కల్పించారు.
ఆదివారం అభ్యర్థులున్న ప్రాంగణాన్ని ఎంపీ సందర్శించారు. గ్రూప్ అభ్యర్థులకు అండగా నిలిచిన ఏనుగు సుదర్శన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు పరిపాలనలో ప్రజల ఉన్నతి కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి గ్రూప్ 1పరీక్ష అభ్యర్థులకు నా వంతుగా వసతి కల్పించడం ఆనందాన్నిచ్చిందన్నారు. జీవితంలో విజ యం సాధించే వారకు పోరాటం సాగించాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు.