కొలంబో: మహిళల ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ నెల 19 నుంచి మొదలుకానున్న టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే దాయాదులు తలపడనున్నారు. ‘ఆసియా కప్ టోర్నీలో అన్ని మ్యాచ్ లకు ఉచిత ప్రవేశం కల్పించనున్నాం. మ్యాచ్‌లు కూడా అంతర్జాతీయ చానెళ్లలో ఉచిత లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశాం. ఈ టోర్నీని విజయవం తం చేయాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావిస్తోంది.అందుకే ఈ నిర్ణయం’ అని లంక క్రికెట్ బోర్డు చెప్పుకొచ్చింది. గ్రూప్ ఉన్న భార త్.. పాక్‌తో మ్యాచ్ అనంతరం నేపాల్, యూఏఈలతో ఆడనుంది. గ్రూప్ శ్రీలంక, బంగ్లా దేశ్, మలేషియా, థాయ్‌లాండ్‌లు ఉన్నాయి. జూలై 19న ప్రారంభం కానున్న టోర్నీలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి.