calender_icon.png 29 March, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తుల అగ్ని గుండాల ప్రవేశం

25-03-2025 01:16:52 AM

వైభవోపెతంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు 

చేర్యాల మార్చి 24 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో అగ్నిగుండాల కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిఏటా మార్గశిర మాసంలో చివరి ఆదివారం నాడు స్వామివారి కల్యాణోత్సవంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు, పాల్గుణ  మాసం చివరి ఆదివారం రోజున అగ్ని గుండాల కార్యక్ర మంతో ముగుస్తాయి.

బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టానికి తోట బావి ప్రాంగణం వేదికయింది. ఈ కత్రువును చూసి తరించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి స్వామి వారి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో తోట బావి వద్దకు అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు.

వీరశైవ ఆగమనుసారం శివాచార్య మహాస్వామి శ్రీశ్రీశ్రీ 1008 మహామండలేశ్వర, దత్త పీఠాధిషులు సిద్ధేశ్వర స్వామి పర్యవే క్షణలో పూజా కత్రోవును నిర్వహించారు. ముందుగా గణపతి, గౌరీ పూజలు నిర్వహించారు. అనంతరం  శైవ పుణ్యాక వచనం, నాంది సమారాధన, మంట పారాధన పూజలు నిర్వహించి, అటు పిమ్మట వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు.

బియ్యపు రాశులను లెక్కించిన తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు అగ్ని ప్రజ్వలన జరిపారు. ఆలయ అనువంశిక అర్చకులు మల్లన్న స్వామి విగ్రహంతో పాటు ఖడ్గం నువ్వు చేత పట్టుకొని అగ్ని ప్రవేశం చేశారు. తదానంతరం భక్తుల ఒక్కొక్కరిగా అగ్గి గుండాలు దాటుతూ  ‘ గుండాలు దాటినం, గండాలు బాపుమని‘ అంటూ తన్మయత్వం పొందుతూ సరాసరి గర్భగుడిలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.

అనంతరం ‘ మల్లొచ్చే ఏడాది మల్లొస్తామంటూ ‘ అంటూ వారి వారి స్వస్థలాలకు తరలిపోయారు. సోమవారం నాడు గర్భాలయంలో అర్చకులు‘ గెలుపు‘, స్వామివారి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్ర అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఈవో కే రామాంజనేయులు, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్, అంజిరెడ్డి, అల్లం శ్రీనివాస్,జయ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.