ఎస్పీ డి వి శ్రీనివాస్ రావు...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నూతనంగా పోలీస్ ఉద్యోగం సాధించిన వారు విధి నిర్వహణలో ఉత్సాహం కనబరచాలని ఎస్పీ డివి శ్రీనివాస్ రావు అన్నారు. స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బందికి జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణలో విధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. 15 రోజులపాటు శిక్షణలో నేర్చుకున్న అంశాలు ఎంతో ఉపయోగపడితే అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ ల పాత్ర చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ అడ్మిన్ పెద్దన్న, ఎంటిఓ అంజన్న, ఆర్ ఎస్ ఐ లు కిరణ్, సందీప్, రాజేష్, లవన్ తదితరులున్నారు.