calender_icon.png 28 March, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన శ్రీ చైతన్య స్పోర్ట్స్ మీట్

24-03-2025 12:00:00 AM

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): హయత్‌నగర్‌లోని ఖల్సా బ్రాంచ్‌లో డాక్టర్ బిఎస్‌రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్స్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పాఠశాలల దిల్‌సుఖ్‌నగర్ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ఆదివారం నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాస్ ఏ అథ్లెటిక్ కోచ్ డాక్టర్ జి వెంకట సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. చదువులతో పాటు ఆటలకు అంతే ప్రాధాన్యతను ఇవ్వటం అభినందనీయమన్నారు. పాఠశాల స్థాయిలో శిక్షణ పొందిన విద్యార్థులు, జోనల్ స్థాయి పోటీలో పాల్గొనడం వల్ల తమను తాము రుజువు చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీఎం సతీష్, ఆల్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ రాజశేఖర్ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. జోనల్ వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య పాఠశాలల నుంచి వందలాదిమంది విద్యార్థులు త్రో బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, 100 మీటర్స్ రన్నింగ్ లాంటి వివిధ విభాగాల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.