calender_icon.png 24 February, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన పాటల పోటీలు

24-02-2025 07:30:08 PM

తెలుగు రాష్ట్రాల నుండి పాల్గొన్న కళాకారులు..

హుజూర్ నగర్: హుజూర్నగర్ పట్టణంలో టౌన్ హాల్ నందు స్పందన కళామండలి వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పాటల పోటీలలో పాల్గొనుటకు గాయని, గాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి మాట్లాడుతూ... ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్పందన నాట్య కళామండలి వారికి అభినందనలు తెలియజేస్తూ కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రమణ్యం వారు అందించిన పాటల రూపంలో ఎప్పటికీ సజీవంగానే ఉంటారు అని, అంతరించిపోతున్న కళరంగాన్ని కాపాడ్డానికి నిరంతరం కృషి చేస్తున్న స్పందన నాట్యమండలి అధ్యక్షుడు కొట్టు బాబుకి, ప్రధాన కార్యదర్శి ధూళిపాల రామకృష్ణకి, ప్రచార కార్యదర్శి వెంకటేశ్వర్లుకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

స్పందన నాట్య కళామండలి అధ్వర్యంలో మహా శివరాత్రి పండగ సంధర్భంగా గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జ్ఞాపకార్ధం స్థానిక ప్రజాభవన్ లో నిర్వహించిన పాటలపోటీలు ఆహుతులను అలరించాయి. ఈ పోటీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కళాకారులు, గాయకులు పాల్గొని తమ ప్రావీణ్యాన్ని చాటారు. నిర్వాహకులు స్పందన నాట్య కళామండలి అద్యక్షులు కొట్టు లక్ష్మీనారాయణ బాబు మాట్లాడుతూ... పాటల పోటీలలో గాయకులు 90 మంది పాల్గొన్నారని ఈ పోటీలలో విజేతలకు మొదటి బహుమతి కె ఎమ్ నాయుడు(వైజాగ్) రూ.10000, రెండవ బహుమతి జి రాజ్ కుమార్ (చిలకలూరిపేట) రూ.8000 మూడవ బహుమతి రాజు (తణుకు) రూ.6000 నాల్గవ బహుమతి చేబ్రోలు శ్రీనివాసచారీ (నాగర్జున సాగర్) రూ.4000 ఎమ్ మాధవీ (విజయవాడ) ఐదవ బహుమతి రూ.2000, 5 గురికి జ్యూరీ, 10 మందికి కన్సోలేషన్ తో పాటు 12 ప్రత్యెక బహుమతులు విజేతలకు అందజేసినట్లు కొట్టు బాబు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పందన నాట్య కళామండలి గౌరవ అధ్యక్షులు గొట్టె రామయ్య, మాజీ ఎంపిపి గూడెపు శ్రీనివాస్, పెద్దిరెడ్డి గణేష్, కీత మల్లికార్జున్, కళాకారుడు పుల్లయ్య, గోపు చలీనమ్మ ధూళిపాళ రామక్రిష్ణ ప్రసాద్, గోపనబోయిన వేంకటేశ్వర్లు, ములకలపల్లి సీతయ్య, చిమట సైదులు, రౌత్ వేంకటేశ్వర్లు, కోలశ్రీను, చిలకరాజు లింగయ్య, నలమాధ శ్రీనివాస్, యరగాని గోపాలం కళాకారులు కళాభిమానులు పాల్గొన్నారు.