నేడు భారత్, ఐర్లాండ్ తొలి వన్డే
రాజ్‌కోట్: స్వదేశంలో వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత మహిళల జట్టు ఐర్లాం డ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాజ్‌కోట్ వేదికగా నేడు భారత్, ఐర్లాండ్ తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు విశ్రాంతినివ్వడంతో స్మృతి మంధాన జట్టును నడిపించనుంది. ఐర్లాండ్‌తో మన అమ్మాయిలకు ఇదే తొలి వన్డే సిరీస్ కావడం విశే షం.
ఇటీవలే విండీస్‌ను వన్డేల్లో 3-0తో వైట్‌వాష్ చేసిన భారత మహిళలు టీ20 సిరీస్‌ను 2-1 చేజెక్కించుకున్నారు. ఐర్లాండ్‌తో సిరీస్‌లోనూ అదే జోరు చూపెట్టాలని భావిస్తున్నారు. కెప్టెన్ మంధాన సూపర్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. మంధానకు తోడు హర్లీన్ డియోల్, ప్రతికా రావల్, రోడ్రిగ్స్ రాణిస్తే ఐర్లాండ్‌కు కష్టాలు తప్పవు.
బౌలింగ్ విభాగంలో రేణుక గైర్హాజరీలో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కీలకం కానుంది. విండీస్‌తో మూడో వన్డేలో దీప్తి (6/31) కెరీర్ బెస్ట్ ప్రదర్శన సాధించింది. టిటాస్ సాధు, సైమా ఠాకూర్ పేస్ బాధ్యతలు మోయనున్నారు.