calender_icon.png 22 April, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం

15-04-2025 01:26:22 AM

* తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు 

* ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం అగ్నిగుండ ప్రవేశం

చిన్నచింతకుంట ఏప్రిల్ 14 : మండల పరిధిలోని అత్యంత వైభవంగా జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా కీలక ఘట్టమైన అగ్నిగుండ ప్రవేశం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఘటం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు.ఈ వడ్డేమాన్ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత కీలక ఘట్టమైన అగ్నిగుండాల కార్యక్ర మాన్ని ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోమవారం తెల్లవారుజామున నిర్వహించారు .

చిన్న చింతకుంట వీరశైవ లింగ యూత్, ఆలయ అర్చకుల నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై అగ్నిగుండంలో నడిచారు. ఆదివారం అర్ధరాత్రి వరకు సిసి కుంట వీరశైవ లింగాయత్ వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల నిర్వహణలో నందికోలసేవ  వివిధ గ్రామా ల భజన బృందాలచే  అఖండ శివనామ స్మరణ, సంకీర్తనలు ఆలపించారు. ఈ  కార్యక్రమంలో మార్కెట్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.