12-02-2025 02:02:23 AM
కరీంనగర్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): సమాజ మార్పు కోసమే డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలి కరీంనగర్ మెదక్ నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగానని ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్ అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ ఒక్కపూట అన్నం కోసం పోరాటం చేస్తున్న పేదరి కంలో ఉన్న సంచారకుటుం బంలో పుట్టిన తాను పగలు కష్టపడుతూ, మరోవైపు చదువుకుంటూ పెరిగానని తెలి పారు.
ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతునప్పుడు పట్టువదలని కసితో కేవ లం 22 ఏళ్ల వయస్సులోనే మొదటి ప్రయ త్నంలోనే ఎస్‌ఐ ఉద్యోగం సాధించానని అన్నారు. 26 సంవత్సరాల పాటు 12 పీఎస్లలో ఎస్పాచ్వోగా చివరిగా డీఎస్పీగా విధులు నిర్వహించానని తెలిపారు. వ్యవస్థలో మార్పుకు రాజకీయ నిర్ణయాధికారమే సరైన మార్గమని డీఎస్పీ స్థాయి ఉద్యోగం నుంచి నిష్ర్కమించి కరీంనగర్-, మెదక్-, నిజామాబాద్,-ఆదిలాబాద్ పట్టభ ద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీకి దిగానని తెలిపారు. పట్టభద్రులు తనకు అండగా నిలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని మదనం గంగాధర్ కోరారు.