calender_icon.png 30 October, 2024 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయమే లక్ష్యంగా బరిలోకి

28-06-2024 02:24:15 AM

చెన్నై: స్వదేశంలో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరు మీదున్న టీమిండియా నేటి నుంచి సౌతాఫ్రికాతో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. చెన్నై వేదికగా నేటి నుంచి జరగనున్న టెస్టులో విజయమే లక్ష్యంగా హర్మన్ సేన బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నుంచి ఐదుగురు టెస్టు అరంగేట్రం చేసే అవకాశముంది. ఉమా ఛెత్రీ, ప్రియా పూనియా, సయికా ఇషాకీ, అరుంధతీ రెడ్డి, షబ్నమ్‌లు జట్టులోకి రానున్నారు. భారత బ్యాటింగ్‌లో వైస్ కెప్టెన్ స్మృతి మంధన మరోసారి కీలకం కానుంది. వన్డే సిరీస్‌లో రెండు శతకాలతో అదరగొట్టిన మంధన అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జేమీమా రోడ్రిగ్స్‌లు కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు.

షఫాలీ వర్మ, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలు బ్యాట్‌తో ప్రభావం చూపాలని భావిస్తున్నారు. బౌలింగ్‌లో పూజా వస్త్రాకర్‌తో పాటు స్నేహ్ రానా తన ఆఫ్‌బ్రేక్‌తో ప్రత్యర్థిని భయపెట్టాలని చూస్తోంది. ఇక సఫారీ జట్టు విషయానికి వస్తే ఫామ్‌లో ఉన్న కెప్టెన్ లారా వోల్వార్ట్, మారినే కాప్‌లు మరోసారి కీలకం కానున్నారు. ఆల్‌రౌండర్లు సునే లుస్, డెల్మీ టక్కర్, తజ్మిన్ బ్రిట్స్ రాణించాలని చూస్తున్నారు. బౌలింగ్‌లో మసబటా క్లాస్, అన్నెకె బోస్క్‌తో పాటు స్పిన్నర్ మ్లాబా కీలకం కానున్నారు.

ఇక మన అమ్మాయిలు చివరి టెస్టును గతేడాది డిసెంబర్‌లో ఇంగ్లండ్‌తో ఆడారు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 347 పరుగుల భారీ తేడాతో విజయా న్ని అందుకుంది. అంతకముందు ఆస్ట్రేలియాను కూడా చిత్తు చేసిన హర్మన్ సేన ఆత్మవిశ్వాసంతో సఫారీలతో పోరుకు సిద్ధమైం ది. 2014లో సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడిన టీమిండియా ఇన్నింగ్స్ 34 పరుగుల తేడా తో గెలుపొందడం గమనార్హం. 1976 లో  ఏకైక టెస్టు మ్యాచ్‌కు చెన్నై వేదికైంది. వెస్టిండీస్‌తో జరిగిన ఆ టెస్టును టీమిండియా డ్రా చేసుకుంది.