calender_icon.png 30 September, 2024 | 6:57 AM

బీమా పథకంలో పేర్లు నమోదు చేయండి

30-09-2024 02:40:24 AM

రాష్ట్రాలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: 70 ఏళ్ల పైబడినవారికీ బీమా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు కేంద్రం ఇటీవల ప్రక టించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి లబ్ధిదారులకు ప్రయోజనాలు కల్పించడంలో అర్హులైన వారి పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

ఈ మేరకు అన్ని రాష్ట్రా ల సీఎస్‌లకు ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి చాంగ్‌సన్ లేఖ రాశారు. పథకంలో పేర్ల నమోదు కోసం ఆయుష్మాన్ మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నమో దు చేసుకున్న అర్హులందరికీ ప్రత్యేకం గా ఆయుష్మాన్ కార్డులు జారీ చేస్తామ ని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ నిరంతరం కొనసాగుతుందని, పథకం కూడా త్వరలోనే అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది.