calender_icon.png 11 January, 2025 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భస్త్రిక ఆరోగ్యానికి భరోసా

03-12-2024 12:00:00 AM

చలికాలంలో మనకు దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ మొదలుకొని అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోయి రోగాలబారిన పడతారు. శ్వాస సంబంధ సమస్యలు, గుండె జబ్బులు తీవ్రమవుతాయి. వీటన్నింటికీ యోగాసనాలతో పరిష్కారం చూపవచ్చు. ఎలాంటి ఔషధం వాడకుండా, ఏ వైద్యుడి సహాయం లేకుండా చలికాలం సమస్యలన్నింటినీ పరిష్కరించే యోగాసనాలు ఉన్నాయి.

కాలానుగుణ వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోడానికి యోగా సాధన చేయండి. అయితే ఈకాలంలో అన్నింటికన్నా భస్త్రిక ప్రాణాయమం చాలామంచిది.  

ఎలా చేయాలి?

* భస్త్రికా ప్రాణాయామం చేయడానికి రోజులో ఉదయం సమయం మంచిది. శుభ్రమైన స్థలాన్ని ఎంచుకోవడం ద్వారా మొదటి భంగిమను అక్కడ వేయాలి.

* భస్త్రికా ప్రాణాయామం చేస్తున్నప్పుడు శరీరాన్ని స్థిరంగా ఉంచుకోవడంపై ప్రధాన దృష్టి ఉంటుంది. కాబట్టి పద్మాసనంలో కూర్చోవాలి.

* వీపు, వెన్నెముక, తల, గొంతు నిటారుగా ఉండేలా చూసుకోండి. భస్త్రికా ప్రాణాయామం చేసేటప్పుడు నోరు పూర్తిగా మూసుకోవాలి.

* ఇప్పుడు ఒకే వేగంతో రెండు నాసికా రంధ్రాల నుండి పూర్తిగా శ్వాస తీసుకోండి. తర్వాత అదే వేగంతో శ్వాసను వదలండి. 

* భస్త్రికా ప్రాణాయామం చేస్తున్నప్పుడు మీరు ఊపిరి పీల్చినప్పుడు, వదులుతున్నప్పుడు, ఊపిరితిత్తులు విస్తరిస్తు ఉంటాయి. 

* భస్త్రిక అనేది ప్రాణాయామంలో ఒక భాగం. కుడి ముక్కు నుంచి ఒకసారి, ఎడమ ముక్కు నుంచి ఒకసారి గట్టిగా ఊపిరితిత్తులనిండా గాలిని పీల్చి, బంధించి         నెమ్మదిగా వదలటం చేయాలి. 

ప్రయోజనాలివే

ఈ ఆసనం సాధన చేస్తే ముక్కు దిబ్బడ, జలుబు, తుమ్ములు, ఎలర్జీ, సైనోసెటీస్ లాంటి వ్యాధులను నివారించవచ్చు. రోగ నిరోధకశక్తి బాగుంటుంది.