calender_icon.png 26 April, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించేలా చూడాలి

25-04-2025 05:46:33 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఉద్యోగ సంఘాల JAC నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ 57 డిమాండ్ లతో  కూడిన సమస్యల వినతిపత్రాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి అందజేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ సమస్యలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని అన్నారు.

ఈ మేరకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు హక్కుగా రావల్సిన DA లు, PRC లు దాటవేసేలా ప్రభుత్వం తీరు ఉందని ఎద్దేవా చేశారు. త్వరలో ముఖ్య మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్తానని, అసెంబ్లీలో సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు సభ్యులు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభాకర్ కూడాల రవికుమార్ ఎంసీ లింగన్న భూమన్న యాదవ్ నరేంద్రబాబు రవికాంత్ తదితరులు ఉన్నారు.