calender_icon.png 8 January, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులకు పౌష్టికాహారం అందేలా చూడాలి

06-01-2025 11:56:56 PM

నల్లగొండ,(విజయక్రాంతి): అంగన్‌వాడీ కేంద్రాల్లోని(Anganwadi Centers) చిన్నారులకు సక్రమంగా పౌష్టికాహారం అందేలా చూడాలని మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితారామచంద్రన్ ఆదేశించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని ఇస్లాంపుర సెక్టార్ సుభాష్‌నగర్ విద్యానగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాలను సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌(Sub-Collector Narayan Amit)తో కలిసి సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో సౌకర్యాలు, హాజరు రిజిస్టార్లు, ఫ్రీ స్కూల్ కిట్లు, కథల పుస్తకాలను పరిశీలించారు. చిన్నారులకు ఫ్లాష్ కార్డులు చూపించి అధ్యాయన సామర్థ్యాలు పరిశీలించారు.

బియ్యం, పాలు, నూనె, పప్పు, బాలామృతం, మురుకులు, పోపు దినుసుల నాణ్యత పరిశీలించి, శుభ్రమైన వాతావరణంలో వంట చేయాలని సిబ్బందికి సూచించారు. ఐదేండ్లలోపు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని టీచర్లకు చెప్పారు. చిన్నారులకు అర్థమయ్యేలా ఆటపాటలతో బోధించాలన్నారు. గర్భిణులు, బాలింతలకు సక్రమంగా పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కేంద్రాల నిర్వహణపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, తహసీల్దార్ హరిబాబు, మిర్యాలగూడ సీడీపీఓ మమత తదితరులున్నారు.