08-02-2025 12:58:17 AM
మంత్రి దామోదర రాజానర్సింహకు వినతి
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): జర్నలిస్టుల హెల్త్‌కార్డుల వ్యవస్థను సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి దామోదర రాజానర్సింహను టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు కోరారు. శుక్రవారం సచివాల యంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
జర్నలిస్టల హెల్త్ కార్డులపై మంత్రి స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగులతోపాటు జర్నలిస్ట్‌ల విషయమై దృష్టి సారించినట్టు చెప్పారు. పలుమార్లు ఇప్పటికే చర్చ లు జరిగాయన్నారు. త్వరలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులతో సమావేశం ఏర్పా టు చేయాలని పేషి అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.
ఒక శాతం కాంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు ఉద్యోగులు అంగీకరించారని మంత్రి తెలిపారు. జర్నలిస్టుల కాంట్రిబ్యూషన్ ప్రభుత్వమే భరించాలని ఫెడరేషన్ నేతలు మంత్రి కోరారు. ఈ మేరకు జర్నలిస్టుల కాంట్రిబ్యూషన్ చెల్లించే విషయమై పరిశీలిస్తామని హమీ ఇచ్చారు.
మంత్రిని కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు గుడిగ రఘు, కార్యదర్శి బీ జగదీశ్, కార్యవర్గ సభ్యురాలు విజయ, హెచ్‌యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్ పాల్గొన్నారు.