- వెనుకబడిన వర్గాలకు ఫీజు రూ.125 దాటొద్దు..
- బీసీఐ, స్టేట్ బార్ కౌన్సిల్స్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ, జూలై 30: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), స్టేట్ బార్ కౌన్సిల్స్ నిబంధనలకు మించి న్యాయవాదులు, లా గ్రాడ్యుయేట్ల నుంచి ఎన్‌రోల్‌మెం ట్ ఫీజు వసూలు చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. వెనుకబడిన వర్గాల నుంచి రూ.125, సాధారణ కేటగిరీ న్యాయవాదుల నుంచి రూ.౭50 కంటే ఎక్కువ ఫీజు డిమాండ్ చేయొద్దని సూచించింది. బీసీఐ అయి నా, స్టేట్ బార్ కౌన్సిల్స్ అయినా పార్లమెంట్ రూపొందించిన చట్టాలకు మించి నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించింది. బీసీఐ, స్టేట్ బార్ కౌన్సిల్స్‌లో ఎన్‌రోల్‌మెంట్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నాయనే వ్యాజ్యంపై మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టి, తీర్పును రిజర్వ్ చేసింది.
న్యాయవాదుల చట్టం సెక్ష న్ 24 ప్రకారం.. ‘బార్’ ఎన్‌రోల్‌మెంట్ రుసుము గరిష్ఠంగా రూ.౭50 ఉందని, అంతకంటే పెంచాలంటే తిరిగి న్యాయవాదుల చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని పేర్కొన్నది. మరోవైపు ప్రస్తుతం ఒడిశాలో రూ.42,100, గుజరాత్‌లో రూ.25,000, జార్ఖండ్‌లో రూ.21,460, ఉత్తరాఖండ్‌లో రూ.23,650, కేరళలో రూ.20,050 చొప్పున స్టేట్ బార్ కౌన్సిల్స్ ఎన్‌రోల్‌మెంట్ ఫీజు వసూలు చేస్తున్నాయని పిటిషనర్ ఆరోపిస్తున్నారు. అధి క ఫీజులతో ఎంతోమంది ఔత్సాహిక న్యాయవాదులు నిరాశకు గురవుతున్నారంటున్నారు. ఇలాంటి సందర్భం లో సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు న్యాయవాదులు, లా గ్రాడ్యుయేట్లకు ఊరటనిస్తున్నాయి.