- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
- కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు
కామారెడ్డి, డిసెంబర్ 24 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మె ల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. మంగళవారం నాగిరెడ్డిపేట మండలానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన 150 మంది కాంగ్రెస్‌లో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, శామ్యూల్, రవీందర్‌రెడ్డి, నరేందర్, రాజిరెడ్డి, గంగారెడ్డి, లక్ష్మణ్, సాయిబాబా, సంపత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.