calender_icon.png 23 February, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జరిగింది చాలు.. ఇక ఆపండి

18-02-2025 01:23:25 AM

  1. మధ్యంతర పిటిషన్లపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి
  2. ఆలస్యానికి కారణం మధ్యంతర పిటిషన్లే అన్న సంజీవ్ ఖన్నా
  3. తదుపరి విచారణ ఏప్రిల్‌కు వాయిదా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ వ్యక్తులు మధ్యంతర పిటిషన్లను ఫైల్ చేస్తున్నారు. ఈ విషయంలో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యంతర పిటిషన్లు వేసేందుకు ఓ పరిమితి ఉండాలని పేర్కొంది.

చీ ఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సం జయ్ కుమార్‌లతో కూడిన బెంచ్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ను ంచి కొత్తగా మధ్యంతర పిటిషన్లు తీసుకోవద్దని సూచించింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. 

ఆలస్యానికి కారణం అదే.. 

సోమవారం ఈ కేసుకు సంబంధించి వాదనలు విన్న ధర్మాసనం కేసు ఆలస్యానికి మధ్యంతర పిటిషన్లు ఓ కా రణం అని వ్యాఖ్యానించింది. ‘ఇక మే ము తీసుకోలేకపోవచ్చు’ అని ప్రధాన న్యాయమూర్తి ఓ న్యాయమూర్తితో తెలిపారు. ‘దేనికైనా ఓ పరిమితి అనేది ఉం టుంది.

ఇప్పటికే ఎన్నో మధ్యంతర పిటిషన్లు వచ్చాయి. ఇక మేము కొత్తవి స్వీ కరించలేకపోవచ్చు’. అని సంజీవ్ ఖన్నా తెలిపారు. 1947 నాటికి దేశంలో ఉన్న ప్రార్థనా స్థలాల యథాతథ స్థితిని కొనసాగించాలని తెలిపింది. దీని నుంచి అ యోధ్య మందిరం-బాబ్రీ మసీదు వివాదానికి మినహాయింపునిచ్చింది. 

ఎన్నో రాజకీయ పార్టీలు

ప్రార్థనా స్థలాల చట్టంపై దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఎన్నో మధ్యంతర పిటిషన్లను దాఖలు చే శాయి. ఈ జాబితాలో కాంగ్రెస్, సీపీఐ వంటి ఎ న్నో పార్టీలు ఉన్నాయి. గత విచారణ సమయంలో కూడా మధ్యంతర పిటిషన్లకు సుప్రీం అనుమతి ఇచ్చింది.  కొత్త గా మధ్యంతర పిటిషన్లను స్వీకరించరాదని, ఏదైనా కొత్త అంశాన్ని ఆ పిటిష న్లో ప్రస్తావిస్తేనే స్వీకరించాలని తెలిపిం ది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వా యిదా వేసింది.