26-03-2025 01:57:01 AM
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): తెలంగాణకు అవసరమైన దానికం టే అదనంగా తాము ఎరువుల సరఫరా చేసినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటివరకు రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులను వెచ్చించినట్లు వెల్లడించారు.
రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోటా సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటికే 12.03 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు తెలిపారు. ఇందులో 10.34లక్షల మెట్రిక్ టన్ను ల యూరియా రైతులకు విక్రయించగా.. మరో 1.68 లక్షల మెట్రిక్ టన్నుల యూరి యా నిల్వ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు.
జాతీయ స్థాయిలో ఎరువుల పర్యవేక్షణ వ్యవస్థ, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఎరువుల బ్లాకేజీని అరికట్టినట్లు వెల్లడించారు. ఎరువుల ఉత్పత్తి పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, అందులో రూ.6,338 కోట్లతో ప్రారంభించిన రామగుండం ఫర్టిలైజర్స్ ఒకటన్నారు.
ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టం ద్వారా ఎరువుల అవకతవకలను పూర్తిగా అరికట్టినట్లు తెలిపారు. అన్నదాతల సంక్షేమమే తమ ప్రథమ కర్తవ్యమని అందుకే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులను సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు.