26-11-2024 12:00:00 AM
చాలినన్ని బస్సులు నడపాలి
రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ సికిందరాబాద్ జంటనగరాలలో బస్సులు చాలినంతగా తిరగడం లేదు. ఏ బస్సును చూసినా రద్దీతోనే కనిపిస్తున్నది. వేళకాని వేళ ఖాళీ బస్సులు తిప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. ప్రత్యేకించి ఎక్కువగా డిమాండ్ ఉన్న రూట్‌లలో బస్సులు ఎక్కువగా నడపాలి.
ముఖ్యంగా ఉదయం పూట స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, వివిధ పనులకోసం మార్కెట్లకు వెళ్లే వ్యాపారులు వంటివారిని అందరినీ దృష్టిలోపెట్టుకొని ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపే దిశగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలి. పలు రూట్లను కలుపుతూ, పెద్ద పట్టణాలు, నగరాలకు బస్సుల సంఖ్యను పెంచవలసిన అవసరం కూడా ఉంది.
ఒకే రూటులో ఎక్కువ బస్సులను నడపకుండా, అన్ని రూట్లలో చాలినంత సంఖ్యలో బస్సులు నడపడానికి చర్యలు తీసుకోవాలి. ఇంకా, సాయంత్రం పూట కూడా ఎక్కువ బస్సులు వేయవలసి ఉంది. ప్రతి డిపోకు వీలైనన్ని అధిక బస్సులు మంజూరు చేయాలి. ప్రజాభీష్టం మేరకు అన్ని రూట్లలో బస్సులు అధిక సంఖ్యలో నడిపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్