calender_icon.png 11 January, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నీలో హాయిగా!

07-10-2024 12:00:00 AM

సాధారణంగా బస్సు, రైలు వంటి ప్రయాణాలు కొందరికి అస్సలు పడవు. అటువంటి వారికి ప్రయాణ సమయంలో వాంతులు రావడం, తల తిరగడం, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి. జర్నీ హాయిగా సాగాలంటే కింది చిట్కాలు పాటించాల్సిందే!

* ప్రయాణానికి ముందు కడుపు నిండా తినడం మంచిదికాదు. మరీ తప్పదు అనిపిస్తే పండ్ల రసాలూ, మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. 

* జర్నీలో పుల్లటి పదార్థాలు తీసుకుంటే వికారానికి కారణం అవుతాయి. కాబట్టి తియ్యని పదార్థాలను తీసుకోవాలి. 

* ఖాళీ పొట్టతో కూడా వెళ్లడం మంచిది కాదు. వేపుళ్ళూ, మసాలాలూ ప్రయాణ సమయంలో అస్సలు తినకూడదు. వాటికి బదులు ఉడికించినవి తీసుకోవాలి. 

* జర్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటే.. ముందు రోజు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి. బాగా నిద్రపోవాలి. అలసటతో కూడిన ప్రయాణం శారీరకంగా, మానసికంగా ఇబ్బందిని కలిగిస్తుంది. 

* ప్రయాణంలో రెస్టారెంట్లు, రోడ్ సైడ్ ఆహార పదార్థాలను తినవద్దు. అవి పొట్టలో ఇన్‌ఫెక్షన్‌కి కారణమవుతుంది. అందుకే సాధ్యమైనంత వరకూ ఇంటి ఆహారం తీసుకోవాలి. 

* జర్నీలో పిప్పర్ మెంట్లు, ఉసిరి, నిమ్మ రుచి గల క్యాండీలూ.. నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే బాగుంటుంది. తద్వారా వాంతులు, వికారం దరిచేరవు. ప్రయాణానికి ముందు ఘాటైన పరిమళ ద్రవ్యా లూ, గాఢత ఎక్కువ ఉన్న మాయిశ్చరైజర్లు వాడకూడదు. వీటి వల్ల వికారం కలిగే ప్రమాదం ఉంది.