వృద్ధాప్యంలో ఏది తినాలన్న ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఏది తింటే షుగర్ పెరుగుతుందో అని కంగారు పడుతుంటారు. కానీ షుగర్ ఉన్నవాళ్లు కూడా తినే స్వీట్ ఒకటి ఉంది. దాన్ని హాయిగా తినొచ్చని చెబుతున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకుందాం..
డ్రై ఫ్రూట్స్ స్వీట్ : బెల్లం, చక్కెర లేకుండా స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. అది కూడా సులభంగానే.. బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే దానికి తేనె కలపాలి. తర్వాత నెయ్యితో లడ్డులు చేసుకొని తింటే సరిపోతుంది. రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు.