calender_icon.png 22 February, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల్లో నైపుణ్యం పెంచండి

22-02-2025 12:33:25 AM

ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి) ః  గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు ఇంగ్లీష్, గణితంలో కనీస సామర్ధ్యాలలో నైపుణ్యాలు పెంపొందింప చేసి వారి విద్యను బలోపేతం చేయడానికి ఉద్దీపకం వర్క్ బుక్స్ , వేదిక్ మాథ్స్ ను ప్రవేశపెట్టడం జరిగిందని, వాటిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యేలా ఆచరణలో పెట్టాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

శుక్రవారం  దుమ్మగూడెం మండలంలోని రామచంద్రుని పేట మరియు రేగు బల్లి- 2, ఏజిహెఎస్ ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించి, ఉద్దీపకం వర్క్ బుక్స్, వేదిక్ మాథ్స్ సంబంధించిన పాఠ్యాంశాలను విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నది, పిల్లలను అడిగి వారి చేత బోర్డుపై రాయించి ఒక్కొక్క విద్యార్థిని లేపి వర్క్ బుక్ లోని సారాంశాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న గిరిజన పిల్లలు ఇంగ్లీష్, గణితం చదవడం రాయడంలో వెనుకబడి పోతున్నందున గణితంలో గణిత ప్రాథమిక స్థాయి సంఖ్యల నుండి కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బాగా హారాలు వాటికి సంబంధించిన కృత్యాలు ,చిత్రాలతో విద్యార్థి పాఠశాలల్లో ఆనందం గా ఆహ్లాదంగా నేర్చుకొనుటకు అనుకూలంగా రూపొందించామని, ఇంగ్లీష్ మీడియంలో రూపొందించిన ఉద్దీపకములు విద్యార్థులు సొంతంగా తామంతట తామే వీటిలోని కృత్యాలు బొమ్మల ఆధారంగా చదువుకొని దానిలోని కృత్యాలను చేసే విధంగా రూపొందించడం జరిగిందన్నారు.

విద్యార్థినీ విద్యార్థులు పాఠశాలల్లో నేర్చుకున్నదే గాక తదుపరి ఇంటి వద్ద ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుగుణంగా ఈ వర్క్ బుక్ ను తయారు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలను పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించడం వలన పిల్లలు నైపుణ్యాలు పెంచుకొని వర్క్ బుక్ సంబంధించిన సారాంశాలు చాలావరకు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. సంబంధిత ఉపాధ్యాయులు పిల్లల చేత పుస్తకములోని కృత్యాలను తెలియజేసి బోర్డుపై రాయించి పిల్లల చేత చెప్పించాలని అన్నారు.

వేదిక్ మ్యాథ్స్ తరగతిని పరిశీలించారు. గణితం సబ్జెక్టు పై భయాన్ని పోగొట్టడానికి వేదిక్ మాథ్స్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగిందని, పిల్లలు తప్పనిసరిగా లెక్కలు ఎలా చేస్తున్నది సంబంధిత టీచర్ గమనిస్తూ ఉండాలని పిల్లలు క్లాసులో నేర్చుకున్నదే గాక ఇంటికిపోయి ప్రాక్టికల్ గా చేయాలని అన్నారు. అనంతరం ఫిజిక్స్ ల్యాబ్ బయో సైన్స్ ల్యాబ్ పరిశీలించి అవసర మైన సామాగ్రి పంపిణీ చేస్తామన్నారు. రేగుబల్లి -2 ఏజిహె ఎస్ పాఠశాలకు త్రీఫేస్ కరెంట్, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం ఏమైనా మైనర్ రిపేర్ లో ఉంటే తప్పకుండా చేయిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రామచంద్రుని పేట పాఠశాల హెఎం బట్టు రాములు, రేగుబలి ్ల-2 పాఠశాల హెఎం భారతమ్మ మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.