calender_icon.png 5 January, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించండి

02-01-2025 04:47:32 PM

ఐటిడిఏ పిఓ రాహుల్...

భద్రాచలం (విజయక్రాంతి): ఐటిడిఏ పరిధిలో గల  గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు బోధిస్తున్న పాఠాలతో పాటు కంప్యూటర్ లో పరిజ్ఞానం పెంపొందించుకునే విధంగా సంబంధిత ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. గురువారం నాడు ఐటీడీఏ పి ఎమ్ ఆర్ సి భవనంలోని సమావేశ మందిరంలో ఏటీడీవోలు పిజిహెచ్ఎంలు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ల ఒకరోజు శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భవిష్యత్తులో ప్రతి పాఠశాలల్లో ఆన్లైన్ చదువులు ఇంటర్నెట్ ద్వారా బోధించే అవకాశం ఉన్నందున ప్రైమరీ స్కూల్ పిల్లల నుండి కాకుండా, మూడో తరగతి నుండి తప్పనిసరిగా పూర్తిస్థాయిలో కంప్యూటర్ నాలెడ్జి సబ్జెక్టులకు సంబంధించిన ప్రతి అంశం తెలిసేలా నేర్పించాలని, ప్రతిరోజు చదువుతో పాటు కంప్యూటర్ శిక్షణ అనేది పిల్లలకు తెలియజేయాలని, బోధించే సబ్జెక్ట్ లతో పాటు ఒక గంట కంప్యూటర్ కు సంబంధించిన క్లాసులు ప్రతి పిల్లవాడికి నేర్పించాలని, ప్రధానోపాధ్యాయులు సబ్జెక్ట్ టీచర్లు తప్పనిసరిగా ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని, ప్రతి పాఠశాలకు 15 రోజులలో కంప్యూటర్లు సరఫరా చేస్తామని అన్నారు.

నేను ఏదైనా పాఠశాలకు పర్యవేక్షణకు వచ్చినప్పుడు తప్పనిసరిగా పిల్లలు కంప్యూటర్ గురించి అడిగినప్పుడు వారు కంప్యూటర్ లోని ప్రతి అంశం తెలియజేసే విధంగా వారిని నిష్ణాతులు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఖమ్మం డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి విజయలక్ష్మి, ఏసీఎంఓ రమణయ్య, రాములు, ఏటీడీవోలు అశోక్ కుమార్, చంద్రమోహన్, రాధమ్మ, జహీరుద్దీన్, సత్యవతి, ఏవో నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.