సెయింట్ లూసియా: ప్రపంచకప్‌లో సూపర్ భాగంగా మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌కు, దక్షిణాఫ్రికా బౌలింగ్ దాడికి మధ్య ఆసక్తికర పోరు ఖాయమే. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై గెలిచిన ఇంగ్లండ్ ఒక్క రోజు వ్యవధిలోనే ప్రొటీస్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇక సఫారీ జట్టు తమ తొలి సూపర్ మ్యాచ్‌లో అమెరికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఫిల్ సాల్ట్, బట్లర్, బెయిర్ స్టో, మోయిన్ అలీ, బ్రూక్, లివింగ్‌స్టోన్‌లతో బ్యాటింగ్ విభాగం శత్రు దుర్భేద్యంగా ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో సమానంగా కనిపిస్తోంది. డికాక్, హెండ్రిక్స్, మార్కరమ్, క్లాసెన్, స్టబ్స్, మిల్లర్లు బ్యాట్‌తో విధ్వంసం చేయాలని చూస్తున్నారు. నోర్జే, రబాడ, మార్కో జాన్సెన్, కేశవ్, షంసీలతో కూడిన బౌలింగ్ పటిష్టంగా ఉంది.