బ్రిడ్జ్‌టౌన్: టీ20 ప్రపంచకప్‌లో ఢిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సూపర్ కీలకపోరుకు సిద్ధమైంది. నేడు గ్రూప్ ఆతిథ్య అమెరికాతో అమీతుమీ తేల్చుకోనుంది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అనూ హ్య ఓటమి చవిచూసి సెమీస్ రేసులో వెనుకబడిన ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. మరోవైపు ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడిన అమెరికా విజయంతో టీ20 ప్రపంచకప్‌ను ముగించాలని చూస్తోంది. ఎలా చూసినా మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. సఫారీలతో మ్యాచ్‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బట్లర్‌లు విఫలమవ్వడం జట్టుపై ప్రభావం పడింది.
ఈ ఇద్దరు రాణిస్తే తిరుగుండదు. మిడిలార్డర్‌లో బ్రూక్, లివింగ్‌స్టోన్‌లు ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. మోయిన్ అలీ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, టోప్లీ, ఆదిల్ రషీద్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. మరోవైపు విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెరికా.. బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైంది. ఇన్‌ఫామ్ బ్యాటర్ ఆండ్రీ గౌస్‌తో పాటు ఆరోన్ జోన్స్ మరోసారి కీలకం కానున్నాడు. కెప్టెన్ మోనాంక్ పటేల్ దూరమవ్వడం జట్టును చిక్కుల్లో పడేసింది. సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, అలీ ఖాన్‌లతో బౌలింగ్ పర్వాలేదనిపిస్తోంది. మరో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది.