calender_icon.png 26 September, 2024 | 1:52 AM

ఇంగ్లండ్‌దే గెలుపు

25-09-2024 11:51:55 PM

లండన్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (77 నాటౌట్) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేధనలో ఇంగ్లండ్ వర్షం పడే సమయానికి 37.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (110 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. వర్షం తెరిపినివ్వకపోవడంతో మెరుగైన రన్‌రేట్‌తో పరుగు లు సాధించిన ఇంగ్లండ్‌ను అంపైర్లు విజేతలుగా ప్రకటించారు.