అంటిగ్వా: టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సూపర్ అడుగుపెట్టింది. శనివారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లండ్ జట్టు నమీబియాపై 41 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 47 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జానీ బెయిర్ స్టో (18 బంతుల్లో 31, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. మోయిన్ అలీ (6 బంతుల్లో 16, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్‌మన్ 2 వికెట్లు తీయగా.. డేవిడ్ వీస్, స్కోల్ట్ చెరొక వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన నమీబియా 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసి ఓటమిని మూటగట్టుకుంది. ఓపెనర్ మైకెల్ వాన్ లింగెన్ (29 బంతుల్లో 33, 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేవిడ్ వీస్ (12 బంతుల్లో 27, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. ఆర్చర్, జోర్డాన్‌లు చెరొక వికెట్ తీశారు. విధ్వంకర ఇన్నింగ్స్‌తో భారీ స్కోరుకు బాటలు వేసిన బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు సూపర్ అర్హత సాధించాయి.