నాటింగ్‌హామ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్.. మరో మ్యాచ్ మిగిలుండగానే వెస్టిండీస్‌పై 2 టెస్టు సిరీస్ విజయం సాధించింది. రెండో టెస్టులో ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయగా.. విండీస్ 457 రన్స్ కొట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసిన ఇంగ్లండ్.. కరీబియన్ల ముందు 385 పరుగుల లక్ష్యాన్ని విధించింది. భారీ లక్ష్యఛేదనలో విండీస్ 143 పరుగులకు ఆలౌటైంది.