calender_icon.png 10 January, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఇంగ్లండ్ అరుదైన రికార్డు

08-12-2024 12:44:33 AM

వెల్లింగ్‌టన్: టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు అరుదైన రికార్డును సాధించింది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో 5 లక్షల పరుగుల సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఇంగ్లండ్‌కు ఇది 1,082వ టెస్ట్ మ్యాచ్. తర్వాతి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, భారత్ ఉన్నాయి. కివీస్‌తో జరిగిన మొదటి టెస్టును గెలిచి 1 ఆధిక్యంలో కొనసాగుతున్న ఇంగ్లండ్.. రెండో టెస్టులో కూడా పట్టుబిగించింది. రెండో రోజు ఆటముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 378 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని ఇంగ్లండ్ ప్రస్తుతం 533 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది.