calender_icon.png 29 December, 2024 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటిష్టస్థితిలో ఇంగ్లండ్

11-10-2024 01:24:20 AM

ముల్తాన్: ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మరింత రసవత్తరంగా మారింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి ఓటమి అంచున నిలిచింది. తొలి ఇన్సింగ్స్ సెంచరీ హీరో సల్మాన్ అగా (41), అమర్ జమాల్ (27) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అకిన్‌సన్, కార్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.  అంతకముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 823 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బ్రూక్ (317) ట్రిపుల్ సెంచరీ చేయగా.. రూట్ (262) డబుల్ సెంచరీతో మెరవడం విశేషం.