calender_icon.png 19 January, 2025 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్

29-07-2024 12:05:00 AM

బర్మింగ్‌హమ్: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ చేసింది. బర్మింగ్‌హమ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్ విధించిన 87 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ వికెట్లేమీ నష్టపోకుండా 7.2 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (57 నాటౌట్), బెన్ డకెట్ (25 నాటౌట్) ధాటిగా ఆడారు. అంతకముందు వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు ఆలౌట్ అయింది. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇక వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 376 పరుగులు చేసింది. మార్క్ వుడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.