ముల్తాన్: పాకిస్తాన్-ఇంగ్లండ్ రెండో టెస్టు రెండో రోజు ఆటముగిసే సరికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. 259/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ 366 పరుగులు చేసింది. పాక్ జట్టులో కమ్రాన్ గులాం (118) సెంచరీతో మెరిశాడు. ఇంగ్లిష్ బౌలర్లలో జాక్ లీచ్ 4, కేర్స్ 3, పాట్స్ 2 వికెట్లతో సత్తా చాటారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డకెట్ సెంచరీ (114) పరుగులు చేయగా.. మిగతా ఎవరూ పెద్దగా రాణించలేదు. మొదటి టెస్టుకు దూరమై, రెండో టెస్టులో కెప్టెన్సీ చేస్తున్న బెన్ స్టోక్స్ (1) ఘోరంగా నిరాశపర్చాడు. ఇంగ్లండ్ ఇంకా 127 పరుగులు వెనుకబడి ఉంది. మరి నేటి ఆటలో ఇంగ్లండ్ లోయరార్డర్ ఎలా రాణిస్తుందో చూడాలి. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ 4, నోమన్ అలీ 2 వికెట్లతో సత్తా చాటారు.