calender_icon.png 14 April, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకేరోజు 104 మంది ఇంజినీర్ల బదిలీ

13-04-2025 02:03:04 AM

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు బదిలీ చేస్తూ టీజీజెన్‌కో ఉత్తర్వులు

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీజెన్‌కో) ఒకేరోజున 104 మంది ఇంజినీర్లను, ఉద్యోగులను యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(వైటీపీఎస్) కు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు  హైదరాబాద్‌లోని విద్యు త్ సౌధ ప్రధాన కార్యాలయం నుంచి రెండు ఆర్డర్లతో కూడిన లెటర్లను యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఆఫీస్‌కు పంపినట్టు అధికారులు తెలిపా రు. బదిలీ అయిన ఇంజినీర్లు, ఉద్యోగులు తక్షణమే వైటీపీఎస్‌లో రిపోర్ట్ చేయాలని టీజీజెన్‌కో ఆదేశాలు జారీ చేసింది. దామరచర్ల వద్ద యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ను 4వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు.