చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ
కోదాడ,(విజయక్రాంతి): విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆశయాలను సాధించాలని కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అన్నారు. ఆదివారం కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే ను ఘనంగా నిర్వహించి మాట్లాడారు. భారతదేశంలో నేటికీ చెక్కుచెదరని ఆనకట్టలు,వంతెనలు కట్టి భావిభారత ఇంజనీర్లకు స్ఫూర్తిని ఇచ్చిన మహనీయుడు విశ్వేశ్వరయ్య అని ఆయన మేధాశక్తిని స్మరించారు. ముఖ్య అతిథి కోదాడ పట్టణ ఏఈ మల్లెల శ్రీనివాసరావు మాట్లాడుతూ... విద్యార్థులు కళాశాల యాజమాన్యం కల్పిస్తున్నసదుపాయాలను సద్వినియోగం చేసుకొని భావి భారత ఇంజనీర్లుగా ఎదగాలన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ పార్వతి మాట్లాడుతూవిశ్వేశ్వరయ్య జలవనుల వినియోగానికి చేసిన కృషిని విద్యార్థినిలకు వివరించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం పట్టణ ఏయి మల్లెల శ్రీనివాసరావు మరియు ఎం ఆర్ టీ. ఏఈ పార్వతీలను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి గాంధీ,వివిధవిభాగాధిపతులునరేష్ రెడ్డి, ఎజాజ్, స్రవంతిఅధ్యాపకులు అబ్దుల్ మన్నన్, నెట్వర్క్ అడ్మిన్ రమేష్ విద్యార్థినులు పాల్గొన్నారు.