calender_icon.png 28 September, 2024 | 10:55 PM

హైదరాబాద్ డీఆర్డీఎల్‌లో ఇంజినీర్స్ కాన్‌క్లేవ్

27-09-2024 12:24:10 AM

డిఫెన్స్ రంగంలో వ్యూహాత్మక అంశాలపై ఇంజినీర్లు, శాస్త్రవేత్తల చర్చ 

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజే షన్ (డీఆర్డీవో), ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ (ఐఎన్‌ఏఈ) సంయుక్తంగా నిర్వహించిన 11వ ఇంజినీర్స్ కాన్ క్లేవ్ గురువారం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని డీఆర్డీఎల్‌లో రెండు రోజులపా టు జరిగే ఈ కార్యక్రమంలో వ్యూహాత్మక అంశాలపై ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు చర్చించారు. ప్రధానంగా డిఫెన్స్ అప్లికేషన్స్, ‘డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్’ అంశాలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటానమిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ అనిల్ కకోద్కర్, గౌరవ అతిథి, డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామ త్, హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్ డైరెక్టర్ జీఏ శ్రీనివాసమూర్తి, క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ జనరల్ యూ రాజాబాబు, ఐఎన్‌ఏఈ ప్రెసిడెం ట్ ప్రొఫెసర్ ఇంద్రనీల్ మన్నా హాజరయ్యారు.