26-03-2025 01:42:58 AM
హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం రెండు కొత్త కాలేజీలను మంజూరు చేసింది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హుస్నాబాద్‌కు శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ, శాతవాహన వర్సిటీకి లా ఇంజినీరింగ్ కాలేజీలను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.
2025 విద్యాసంత్సరానికి అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేశారు. ఇంజినీరింగ్ కాలేజీకి రూ.44.12 కోట్లు, లా కాలేజీకి రూ.22.96కోట్లు మంజూరు చేశారు. రెండు కాలేజీలు మంజూరు చేసినందుకు గానూ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు.