calender_icon.png 1 April, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీ

26-03-2025 01:36:33 AM

ఎల్కతుర్తిలో ఐఐఐటీ  కళాశాల ఏర్పాటు

భీమదేవరపల్లి మార్చి 25 (విజయ క్రాంతి)): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఐ ఐ టి కళాశాల హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భీమదేవరపల్లి మండల కేంద్రంలో మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టంపల్లి ఐలయ్య భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రివర్యులకు అభినందనలు తెలియజేశారు.

గత బి ఆర్ ఎస్ పార్టీ పదేళ్లు చేసింది ఏమి లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి హుస్నాబాద్ నియోజకవర్గం లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తో ఎల్కతుర్తి మండలం వచ్చే విద్యా సంవత్సరం నుండి ఐ ఐఐటీ కాలేజీ మంజూరు చేసిందన్నారు దాంతోపాటు హుస్నాబాద్ మండలంలో ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేసిందన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గం భవిష్యత్తులో అనేక పథకాలలో  ముందుకు వెళుతుందని  అన్నారు.  ఈ కార్యక్రమంలో పచ్చునూరి కరుణాకర్, చాగంటి వెంకటేశ్వర్లు ఎలుక పెళ్లి శ్రీనివాస్, ఎలుక పెళ్లి రాకేష్, చిట్టెంపల్లి చిరంజీవి, చిట్టంపల్లి వెంకటేష్, వల్లెపు మహేందర్, పోగుల శ్రీకాంత్, చిటుకూరి అనిల్, రాజేష్ ,చంటి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు